న్యూస్‌రీల్
శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
బదిలీలకు సై!
మేలో పూర్తి కానున్న ప్రక్రియ
మూడేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకు స్థానచలనం
అనువైన చోట పనిచేసేందుకు పైరవీలు
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు రాష్ట్ర సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మే 1వ తేదీ నుంచి 31 వరకు ఈ బదిలీల ప్రక్రియకొనసాగనుంది. మూడేళ్లు ఒకే చోట పనిచేసిన వారికి స్థానచలనం కలగనుంది. అదే సమయంలో 4 ఏళ్లు పని చేసిన ఉద్యోగులను తప్పనిసరిగా ట్రాన్స్‌ఫర్ చేయనున్నారు. దీంతో అనువైన చోటుకు వెళ్లేందుకు పైరవీలు షురూ చేశారు. కాగా ఇందులో ఆరు శాఖలకు మాత్రం బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. – మెదక్‌జోన్
జిల్లాలో సుమారు 7 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా 2024లో నెల రోజులపాటు ఉద్యోగులకు బదిలీల ఛాన్స్ ఇచ్చిన ప్రభుత్వం.. రెండేళ్ల అనంతరం మళ్లీ అవకాశం ఇచ్చింది. కాగా ఇందులో మూడేళ్లు ఒకేచోట విధులు నిర్వహించిన ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకునేందుకు అర్హులుగా నిర్ణయించింది. నాలుగేళ్ల పాటు ఒకే చోట పనిచేసిన ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా బదిలీపై వెళ్లాల్సిందే. కాగా రాష్ట్రస్థాయి మల్టీజోనల్, జోనల్ స్థాయితో పాటు జిల్లా పరిధిలోనూ ఈ బదిలీల ప్రక్రియ జరగనుండటంతో అనుకూలమైన పోస్టింగ్‌ల కోసం ఉద్యోగులు అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది.
3 వేల పైచిలుకు..
జిల్లాలోని అన్నిశాఖల పరిధిలో పనిచేసే ఉద్యోగులు 7 వేల పైచిలుకు ఉండగా, వారిలో బదిలీ నుంచి మినహాయించిన ఆరు శాఖల ఉద్యోగులు పోనూ మిగితా 4,220 మంది ఉద్యోగులకు బదిలీకి అవకాశం ఉంది. వీరిలో మూడేళ్ల పాటు ఒకేచోట పనిచేసిన వారు సుమారు 3 వేల పైచిలుకు మంది ఉంటారని, ఇందులో 1,200 మంది నాలుగేళ్ల సర్వీసు నిండిన వారు ఉన్నట్లు తెలిసింది.
వారికి ప్రత్యేక సడలింపు
ఏదేనిశాఖలో గరిష్టంగా 40 శాతం మించకుండా బదిలీలు చేయాలి. అలాగే దివ్యాంగులు, స్పౌజ్, మరో ఏడాదిలో రిటైర్డ్ అయ్యే ఉద్యోగులతో పాటు అనారోగ్యంతో బాధపడే వారికి ఈ బదిలీల నుంచి ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు.
ఆరు శాఖలకు మినహాయింపు
జిల్లాలో అన్నిశాఖలు కలిపి 35 నుంచి 40 వరకు ఉండగా, వాటిలో ప్రత్యేకించి ఆరు శాఖలకు ఈ బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇందులో విద్యాశాఖ, రెవెన్యూ, కమర్షియల్, ఎక్సైజ్, రవాణా, ఫారెస్ట్ ఉన్నా యి. కాగా విద్యా, రెవెన్యూశాఖల ఉద్యోగులకు త్వరలో జరగబోయే జనగణన కారణంగా ఎన్యూమరేటర్లుగా గుర్తించి శిక్షణ ఇస్తున్నారు. అలాగే కమర్షియల్, ఎకై ్సజ్, రవాణశాఖలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేవి కావటంతో వాటిని మినహాయించారు. ఇక అటవీశాఖ ప్రత్యేక జీఓ ప్రకారమే బదలా యింపులు ఉంటాయని, ఈ సాధారణ బదిలీలతో ఈ శాఖకు సంబంధం ఉండదని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.


