మెదక్ కలెక్టరేట్/నర్సాపూర్: ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగింది. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ డిపోల పరిధిలో సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఆత్మబలిదానం చేసుకున్న డ్రైవర్ శంకర్‌గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మెదక్‌లో కార్మికులు రాందాస్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. వీరికి బీఆర్‌ఎస్ నేత, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్, సీఐటీయూ తదితర సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల న్యాయ పోరాటానికి అండగా నిలబడతామన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్‌లో కార్మికులు ధర్నా నిర్వహించారు. వీరికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ పలువురు నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అనంతరం కార్మికులు విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక సిబ్బందిని పూలు ఇచ్చి వేడుకున్నారు. ‘మీ కాళ్లు మొక్కుతాం.. మీరు డ్యూటీలు చేస్తూ మా కడుపులు కొట్టొద్దని’ బతిమిలాడారు. అనంతరం ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి కార్మికులను అక్కడి నుంచి పంపించి వేశారు.
మెదక్: డ్రైవర్ శంకర్‌గౌడ్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కార్మికులు
నిరసన తెలిపిన కార్మికులు
మద్దతు తెలిపిన పార్టీలు,
సంఘాల నాయకులు


