రామాయంపేట(మెదక్): రోజు రోజుకు తీవ్రమవుతున్న ఎండలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీఎంహెచ్‌ఓ శ్రీరాం సూచించారు. శుక్రవారం మండలంలోని ప్రగతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరికై నా వడదెబ్బ సోకితే వెంటనే సపర్యలు చేపట్టి వైద్యసేవలు అందజేయాలన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం సక్రమంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆస్పత్రిలో నిల్వ ఉన్న ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతో పాటు ఐవీ ఫ్లూడ్ బాటిళ్లు, రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆస్పత్రి డాక్టర్ వైశాలి, సిబ్బంది పాల్గొన్నారు.
ఆటపాటలతో విద్యాబోధన
నర్సాపూర్ రూరల్/ కౌడిపల్లి: అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటలతో విద్యాబోధన చేస్తున్నామని డీడబ్ల్యూఓ హేమభార్గవి తెలిపారు. శుక్రవారం మండలంలోని రాయిలాపూ ర్ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్‌డేకు ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. చెప్పారు. అలాగే నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తి అంగన్‌వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పిల్లలకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సుజా త, సర్పంచ్ స్వప్న, అంగన్‌వాడీ టీచర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.
అనుమతి లేని పాఠశాలలపై
చర్యలు తీసుకోండి
మెదక్ కలెక్టరేట్: అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం డీఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని అవుసులపల్లిలో నిర్మాణంలో ఉన్న పాఠశాలలో గుట్టుచప్పుడు కాకుండా అడ్మిషన్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికై నా జిల్లాలో అనుమతి లేకుండా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
రికార్డుల పరిశీలన
నర్సాపూర్: జెడ్పీ సీఈఓ ఎల్లయ్య శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా కార్యాలయంలోని పలు రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయా విభాగాల సిబ్బందితో మాట్లాడి రికార్డులు సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. కాగా ఇన్‌చార్జి ఎంపీడీఓ మహ్మద్ మోజం హుస్సేన్ కార్యాలయ వివరాలను సీఈఓకు వివరించారు.
62 బస్సులు.. 6 రూట్లు
మూడో రోజు పెరిగిన సర్వీసులు
మెదక్ కలెక్టరేట్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజా రవాణకు ఇబ్బందులకు కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సు రూట్లను పెంచుతున్నారు. మూడో రోజు శుక్రవారం 55 మంది డ్రైవర్లు, కండక్టర్లతో సిద్దిపేట, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బొడ్మట్‌పల్లి, పటాన్‌చెరువు, జేబీఎస్ (6) రూట్లలో మొత్తం 62 బస్సులను నడిపించారు. మొదటి, రెండోరోజు కొనసాగిన ఆర్టీసీ కార్మికుల వ్యతిరేకత మూడు రోజు కనిపించలేదు. మెదక్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట కార్మికులు ప్రశాంతంగా సమ్మె కొనసాగించారు.


