అభివృద్ధిలో భాగస్వాములు కండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో భాగస్వాములు కండి

Apr 25 2026 9:30 AM | Updated on Apr 25 2026 9:30 AM

చిన్నశంకరంపేట(మెదక్‌)/చేగుంట(తూప్రాన్‌): గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులు భాగస్వామ్యులు కావాలని డీపీఓ యాదయ్య సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో రెండో విడత వార్డు సభ్యులు శిక్షణ ముగింపులో పాల్గొన్న ఆయన వార్డు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ అభివృద్ధికి సహకరించాలని, నిధులు సద్వినియోగం అయ్యోలా క్రియాశీలకంగా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్‌, ఏపీఓ వినోద్‌, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం చేగుంట పంచాయతీలో సర్పంచ్‌ స్రవంతితో పాటు పాలకవర్గ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామంలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి సమస్యలను నివారించేందుకు ప్రత్యేకంగా బోరు బావులను తవ్వించుకోవచ్చని తెలిపారు.

డీపీఓ యాదయ్య

Advertisement
 
Advertisement
Advertisement