పెద్దశంకరంపేట(మెదక్): భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కమలాపూర్‌లో భూముల రీసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 1929లో భూముల సర్వే జరిగిందని, ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పకడ్బందీగా సాగుతుందన్నారు. అనంతరం జిల్లా సర్వే ఏడీ కిషన్ మాట్లాడుతూ.. జిల్లాలో 25 మ్యాపులు లేని గ్రామాలను ముందుగా గుర్తించి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతీ కమతానికి శాటిలైట్ ద్వారా సర్వే చేపట్టి భూధార్ నంబర్ కేటాయిస్తామన్నారు. అలాగే ప్రభుత్వ, గ్రామకంఠం, శిఖం భూములు గుర్తిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభుదాస్, ఎంపీడీఓ క్రాంతికుమార్, సర్వే ఇన్స్‌పెక్టర్ అజీమ్, సర్పంచ్ సుజాత, నాయకులు మధు, నారాగౌడ్, మురళి, రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి


