హవేళిఘణాపూర్(మెదక్): సొంత స్థలం ఉండి గూడు లేని వారికే మొదటి ప్రాధాన్యతనిస్తూ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శుక్రవారం మెదక్ మండలం శివాయిపల్లిలో తోట లక్ష్మి ఇంటి గృహ ప్రవేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం విడతల వారీగా నిధులు విడుదల చేస్తుందన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలను మంజూరు చేస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 750 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వివరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, హౌసింగ్ పీడీ మాణిక్యం, సర్పంచ్ వినిత ఉన్నారు.
నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి
మెదక్ కలెక్టరేట్: నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటేనే ఉద్యోగ అవకాశాలు సాధ్యపడతాయని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానుగుణంగా యువత చదువుతో పాటు ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని, అప్పుడే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అంతకుముందు ఐటీసీ నిర్వహిస్తున్న కార్యకలాపాలపై ఆరా తీశారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


