తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం | - | Sakshi
Sakshi News home page

తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం శిక్షణ తరగతులు వాయిదా వేయండి ఉదయమే ‘ఉపాధి’ పనులు కో ఆప్షన్‌ పదవులకు నోటిఫికేషన్‌ భూ పరిరక్షణ అందరి బాధ్యత

మెదక్‌ కలెక్టరేట్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు మెదక్‌ ఆర్టీసీ డీఎం సురేఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెదక్‌ డిపోలో తాత్కాలిక డ్రైవర్లుగా నియమించుకోవడానికి 18 నెలల హెవీ లైసెన్స్‌ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే నర్సాపూర్‌ డిపోలో తాత్కాలిక కండక్టర్‌ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, విద్యార్హత బయోడేటాతో డిపోలలో సంప్రదించాలన్నారు.

పాపన్నపేట(మెదక్‌): ప్రభుత్వ పాఠశాలలకు గురువారం చివరి దినం కావడంతో జనగణన శిక్షణ తరగతుల సమయాన్ని మరుసటి రోజుకు వాయిదా వేయాలని తపస్‌, టీపీటీఎఫ్‌, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్‌, బాల్‌రాజ్‌, ఎల్లం కోరారు. ఈ మేరకు ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. శిక్షణ తరగతుల సమయాన్ని ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. వారి వెంట టీఎస్‌యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి ఎండీ.రఫీ, సభ్యుడు శ్రవణ్‌ తదితరులు ఉన్నారు.

డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌

శివ్వంపేట(నర్సాపూర్‌): ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉపాధి హామీ పనులను కూలీలు ఉదయం వేళలో మాత్రమే చేయాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌ సూచించారు. బుధవారం శివ్వంపేటలో నిర్వహిస్తున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఈసందర్భంగా కూలీలతో మాట్లాడి పలు సూచనలు చేశారు. పనిచేసే చోట కూలీలకు నీడ ఏర్పాటుతో పాటు తాగు నీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. నిర్ధేశించిన పనులు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ అనిల్‌, కార్యదర్శి రమాదేవి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్‌: మున్సిపాలిటీలో కోఆప్షన్‌ పదవులకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు బుధవారం ఇన్‌చార్జి కమిషనర్‌ తిరుపతి తెలిపారు. మున్సిపల్‌ పరిపాలనలో ప్రత్యేక పరి/్ఞానం ఉన్న వారి కోసం రెండు, అల్పసంఖ్యాక వర్గాల కోసం రెండు కోఆప్షన్‌ పదవులు ఉంటాయని, రెండు వర్గాలలో ఒక పోస్టు మహిళకు కేటాయించినట్లు చెప్పారు. కాగా ఈనెల 23 నుంచి 29 వరకు తమ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

మెదక్‌జోన్‌: సమస్త జీవరాశులకు జీవనాధారమైన భూమికి హాని కలిగించొద్దని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ హుస్సేన్‌ తెలిపారు. ప్రపంచ ఎర్త్‌డేను పురస్కరించుకొని బుధవారం కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పారిశ్రామికీకరణ, అధిక జనాభాతో భూమికి, పర్యావరణానికి నష్టం జరుగుతుందన్నారు. సరిదిద్దుకోకపోతే రేపటి తరాలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అంతకుముందు ఎకో క్లబ్‌ సభ్యులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ తిరుమలరెడ్డి, డాక్టర్‌ శ్రీలత, రమణ కుమార్‌, విశ్వనాథ్‌, రాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement