ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: ఘోష్ కమిషన్‌పై బుధవా రం హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటిదని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌పై విచారణ కోసం ప్రభుత్వం నియమించిన ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కమిషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేధించడాన్ని కక్షపూరిత చర్యగా ఆమె అభివర్ణించారు. హామీలు అమలు చేయకుండా కాళేశ్వరంపై కమిషన్, ఫార్ములా రేస్, ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీల అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.


