గ్రామాభివృద్ధికి సహకరించాలి
డీఎల్‌పీఓ సురేష్‌బాబు
పెద్దశంకరంపేట(మెదక్): గ్రామాభివృద్ధికి ప్రజాప్రతినిధులు సహకరించాలని డీఎల్‌పీఓ సురేష్‌బాబు అన్నారు. మంగళవారం స్థానిక గ్రామపంచాయతీలో సర్పంచ్, వార్డుసభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో పరస్పర అంగీకారంతో పనులు చేపట్టాలన్నారు. అలాగే నిధుల ఖర్చులో జాగ్రత్తలు పాటించడంతో పాటు పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతికుమార్, ఎంపీఓ జాకీర్‌హుస్సేన్, సర్పంచ్ జంగం రేణుక, ఉపసర్పంచ్ రాజుగౌడ్ తదితరులున్నారు.
రూ.56 కోట్లు విడుదల
రెండో విడత భరోసా నిధులు
మెదక్‌జోన్: రబీ సీజన్‌కు సంబంధించి ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత నిధులు మంగళవారం విడుదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 93 వేల ఎకరాలకు రూ. 56 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మొదటి, రెండో విడతకు సంబంధించి ఇప్పటివరకు 2.76 లక్షల ఎకరాలకు రూ. 166 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారని అధికారులు పేర్కొన్నా రు. మెదక్ జిల్లాలో 3.95 లక్షల ఎకరాల వ్యవ సాయ సాగు భూములు ఉండగా గతంలో రూ. 220 కోట్లు పైచిలుకు నిధులు విడుదలయ్యా యి. ఈయేడు కొత్తగా వేలాది పాస్ బుక్కులు సైతం వచ్చాయి. గతంలో పార్ట్– బీలో ఉన్నటువంటి భూములను పట్టాలు చేయటంతో వ్యవసాయ సాగుభూమి పెరుగుతుంది. ఇక మూడో విడతలో మిగిలిన నిధులు జమ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ
మహిళా వ్యతిరేకి..
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రవీణ్
మెదక్‌జోన్: మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం తెలిసిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మెదక్ జిల్లా మీడియా ఇన్‌చార్జి ప్రవీణ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మెదక్‌కు వచ్చిన సందర్భంగా మాట్లాడారు. బీజేపీ మహిళలకు 33 శాతం రిజర్వేషనన్ కల్పించాలని బిల్లు పెడితే దానిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డివి కేవలం మాటలే తప్పా చేతల్లో అభివృద్ధి కానరావటం లేదన్నారు. హైడ్రా పేదోళ్ల ఇళ్లనే కూల్చుతున్నారు తప్పా పెద్దలవి ముట్టడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, నేతలు గడ్డం శ్రీనివాస్, రంజిత్‌రెడ్డి, నాయిని ప్రసాద్, గడ్డం కాశినాథ్, సిద్దిరాములు, మహిళా నేతలు పాల్గొన్నారు.


