ఎంత మందికై నా పని కల్పిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఎంత మందికై నా పని కల్పిస్తాం

Apr 22 2026 8:42 AM | Updated on Apr 22 2026 8:42 AM

డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌రావు

డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌రావు

చిన్నశంకరంపేట(మెదక్‌): ఉపాధిహామీ పథకం ద్వారా ఎంత మందికై న పని కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌రావు తెలిపారు. మంగళవారం మండలంలోని రుద్రారంలో ఉపాధిహామీ పథకం పనులు పరిశీలించారు. అలాగే, ఉపాధిహామీ కూలీలతో మాట్లాడి పని ప్రదేశంలో కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాల్లో ఎంతమంది పనికి వచ్చిన పనులు కల్పిస్తున్నట్లు తెలిపారు. పనులకు వచ్చేలా కూలీలను ప్రోత్సహించాలన్నారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని ఉదయం సమయంలోనే పనులు ముగించుకోవాలని సూచించారు. పనులు చేసిన ఉపాధి కూలీలకు ఆన్‌లైన్‌ చేసిన వెంటనే డబ్బులు వచ్చేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ మేరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ టీఏ సంపత్‌, సర్పంచ్‌ సంతోషకు పలు సూచనలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement