దిశ, దశ చూపిన నాయకుడు అంబేడ్కర్‌ | - | Sakshi
Sakshi News home page

దిశ, దశ చూపిన నాయకుడు అంబేడ్కర్‌

Apr 21 2026 6:25 AM | Updated on Apr 21 2026 6:25 AM

దిశ, దశ చూపిన నాయకుడు అంబేడ్కర్‌

మెదక్‌ కలెక్టరేట్‌: దేశానికే దశ దిశలను సూచించిన మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని మెదక్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దొంతి నరేష్‌ గౌడ్‌ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి మెదక్‌ పట్టణంలోని ఆజంపురలో చైతన్య అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో 135వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నరేష్‌గౌడ్‌ హాజరై అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ రాజ్యాంగ విలువలకు కట్టుబడి పని చేయాలని, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్‌ చూపిన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. అనంతరం చైతన్య అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో మెదక్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు దీపక్‌కుమార్‌. పల్లెరాణి బాలరాజ్‌, సంపత్‌, శశికాంత్‌, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు చెదల భాస్కర్‌, చైతన్య అంబేడ్కర్‌ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నరేష్‌గౌడ్‌

Advertisement
 
Advertisement
Advertisement