దెబ్బతిన్న పంటల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

దెబ్బతిన్న పంటల పరిశీలన

Apr 21 2026 6:25 AM | Updated on Apr 21 2026 6:25 AM

దెబ్బతిన్న పంటల పరిశీలన

చిన్నశంకరంపేట(మెదక్‌): చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ప్రమోద్‌కుమార్‌ విద్యార్థులకు క్షేత్రస్థాయిలో రైతులు సాగు చేస్తున్న పంటలు, విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు పడుతున్న బాధలపై అవగాహన కల్పించారు. శాలతిపేట గ్రామ పాఠశాల సమీపంలో ఆదివారం కురిసిన ఆకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను విద్యార్థులకు చూయించారు. ఐదు నెలల పాటు కష్టపడి సాగు చేసిన వరి పంట ఒక్క రోజులో జరిగే నష్టం గురించి వివరించారు. విద్యార్థులకు ఆంగ్ల బోధనతో పాటు క్షేత్రస్థాయి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర పర్యటనతో రైతు కష్టాలు తెలిస్తే కుటుంబంపై గౌరవం, ఆహారంపై శ్రద్ధ చూపుతారని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement