పకడ్బందీగా జనగణన చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా జనగణన చేపట్టాలి

Apr 21 2026 6:25 AM | Updated on Apr 21 2026 6:25 AM

పకడ్బందీగా జనగణన చేపట్టాలి శివ్వంపేట(నర్సాపూర్‌): జనగణనకు సంబంధించి వివరాలు సమగ్రంగా సేకరించాలని తహసీల్దార్‌ కమలాద్రి అన్నారు. జనగణన 2027లో భాగంగా శివ్వంపేట ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఫీల్డ్‌ ట్రైనర్ల ద్వారా ఏవైనా సందేహలు ఉంటే నివృత్తి చేసుకుని సరైన డేటా సేకరించాలన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్‌ ట్రైనర్స్‌ సంతోష్‌కుమార్‌, ఆంజనేయులు, తదితరులు ఉన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

కౌడిపల్లి(నర్సాపూర్‌): జనగణనను జాగ్రత్తగా చేయాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ సూచించారు. సోమవారం మండల కేంద్రం కౌడిపల్లి ఉన్నత పాఠశాలలో జనగణన ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో కాగితంపై జనగణన వివరాల రాసేవారని, ప్రస్తుతం 2027 జనగణన యాప్‌లో డిజిటల్‌ సర్వే జరుగుతుందని చెప్పారు. ఇండ్లు, జనగణన జాగ్రత్తగా చేయాలన్నారు. డిజిటల్‌ సర్వే చేసేటప్పుడు ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు యాప్‌లో పొరపాటున తప్పులు నమోదు చేసిన సరిచేసుకోవాలన్నారు. ప్రతి ప్రశ్నకు సమాధానం నమోదు చేసి సర్వేను పకడ్బందీగా చేయాలని తెలిపారు. శిక్షణ సందర్భంగా ఏవైనా అనుమానాలు ఉంటే క్లియర్‌ చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో నర్సాపూర్‌ ఆర్డీఓ రామకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్‌ జహీర్‌, ఆర్‌ఐ విజయలక్ష్మి, ట్రేనర్స్‌ మహిపాల్‌, రామక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సమగ్రంగా వివరాలు సేకరించాలి

నిర్లక్ష్యానికి తావివ్వొద్దు

చిన్నశంకరంపేట(మెదక్‌): జనగణనలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వవద్దని డీఎఫ్‌ఓ, ప్రత్యేక అధికారి జోజు పేర్కొన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జనగణన శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణనలో ప్రతి ఇంటిని టచ్‌ చేయాలని కోరారు. కార్యక్రమలంలో తహసీల్దార్‌ మాలతి, ఎఫ్‌ఆర్‌ఓ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement