ఘనంగా బసవ జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బసవ జయంతి వేడుకలు

Apr 21 2026 6:25 AM | Updated on Apr 21 2026 6:25 AM

ఘనంగా బసవ జయంతి వేడుకలు రేగోడ్‌(మెదక్‌): మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం మహాత్మా బసవేశ్వరుడి జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. బసవేశ్వరుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు పంచారు.

అల్లాదుర్గం(మెదక్‌): వీరశైవ లింగాయత్‌ల ఆరాధ్యదైవం విశ్వగురువు బసవేశ్వరుడి జయంతి వేడుకలు సోమవారం అల్లాదుర్గం మండలంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మండల పరిధి గడిపెద్దాపూర్‌, ముస్తాపూర్‌, చిల్వెర, బహిరన్‌దిబ్బ , చేవెళ్ల , అల్లాదుర్గం గ్రామాల్లో బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. యువత బసవేశ్వరుడి అడుగుజాడల్లో నడవాలని కోరారు.

నర్సాపూర్‌లో..

నర్సాపూర్‌: మహాత్మా బసవేశ్వర జయంతి నర్సాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన వీరశైవ లింగాయత్‌ సమాజం ఆధ్వర్యంలో బసవేశ్వరుని విగ్రహానికి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో వీరప్పగురూజీ, బసప్ప, సంగమేశ్వర, వినోద్‌, సిదిరాంలు, ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

టేక్మాల్‌ మండలంలో..

టేక్మాల్‌(మెదక్‌): మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం బసవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం టేక్మాల్‌లోని మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఉన్న బసవేశ్వర విగ్రహానికి లింగాయత్‌ సంఘం ఆధ్వర్యంలో నాయకులు, యువకులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వర అడుగుజాడల్లో నడవాలని కోరారు.

ఘనంగా బసవేశ్వరుని జయంతి

Advertisement
 
Advertisement
Advertisement