గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు | - | Sakshi
Sakshi News home page

గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు

Apr 21 2026 6:25 AM | Updated on Apr 21 2026 6:25 AM

శివ్వంపేట(నర్సాపూర్‌): మండల పరిధి గుండ్లపల్లి గ్రామంలో డెంగ్యూ కలకలంపై సాక్షి దినపత్రికలో ఆదివారం కథనం ప్రచురితమైంది. అందుకు స్పందించిన సర్పంచ్‌ మమత సోమవారం గ్రామంలో పరిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పలు వార్డులో బ్లీచింగ్‌ పౌండర్‌ చల్లడంతో పాటు మురికికాల్వలు శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్‌ మమత సూచించారు.

ఎంపీఓగా వినోద్‌కుమార్‌

చిన్నశంకరంపేట(మెదక్‌): చిన్నశంకరంపేట మండల నూతన ఎంపీఓగా వినోద్‌కుమార్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్‌ జిల్లాలో పని చేస్తున్న వినోద్‌కుమార్‌ పదోన్నతిపై చిన్నశంకరంపేటకు బదిలీపై వచ్చారు. ఇక్కడ పని చేసిన గిరిజారాణి గతంలోనే నిజామాబాద్‌ జిల్లాకు బదిలీపై వెళ్లారు. గత కొన్ని రోజులుగా చిన్నశంకరంపేట ఈఓ ప్రదీప్‌ అదనపు బాధ్యతలు నిర్వహించగా, తాజాగా వినోద్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ దామోదర్‌, గ్రామ కార్యదర్శులు అభినందించారు.

పీఏసీఎస్‌ సొసైటీ యూనియన్‌ అధ్యక్షుడిగా రవీందర్‌

పెద్దశంకరంపేట(మెదక్‌): మెదక్‌ జిల్లా పీఏసీఎస్‌ సొసైటీ యూనియన్‌ అధ్యక్షుడిగా పెద్దశంకరంపేటకు చెందిన సీఈఓ రవీందర్‌ సోమవారం ఏకగ్రీవంగాఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా మధు, కృష్ణ, ప్రధానకార్యదర్శిగా నవీన్‌, ట్రెజరర్‌గా అమీర్‌అలీ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా నవీన్‌, జాయింట్‌ సెక్రటరీగా సాయికిరణ్‌, సభ్యుడిగా వెంకటస్వామి, దినేష్‌, రమేష్‌, శ్రీనివాస్‌, స్వా మి, శోభారాణి, వేణుగోపాల్‌ ఎన్నికయ్యారు.

నాణ్యమైన విద్య అందించాలి

నర్సాపూర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని స్థానిక మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహం, ప్రభుత్వ పాఠశాలలు తనిఖీ చేసి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఆమె విద్యార్థులతో మాట్లా డి సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement