నర్సాపూర్: చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని స్థానిక అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల ఎక్స్‌లెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ బలరాం పేర్కొన్నారు. గురుకుల ఆవరణలో మెదక్ రీజియన్ పరిధిలోని బాలుర గురుకుల పాఠశాలలకు చెందిన 50 మంది విద్యార్థుల సాప్ట్‌బాల్ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరం వారం రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.


