కొనుగోలు కేంద్రాలతో ప్రయోజనం | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాలతో ప్రయోజనం

Apr 21 2026 6:25 AM | Updated on Apr 21 2026 6:25 AM

కొనుగోలు కేంద్రాలతో ప్రయోజనం

కొల్చారం(నర్సాపూర్‌): రైతులు దళారుల నుంచి మోసపోకుండా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని వరిగుంతం, సంగాయిపేట, రంగంపేట, పైతర, కోనాపూర్‌ గ్రామాల్లో పర్యటించి.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పైతర, కోనాపూర్‌ గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరయిన ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ, నిర్మాణం పూర్తయిన ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యేకు రావాల్సిన నిధుల్లో ప్రభుత్వం కోత విధించడంతో ఆశించిన మేరకు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. జోగిపేట నుంచి మెదక్‌ వరకు రహదారి పునరుద్ధరణకు రూ.26 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ముందస్తుగా ప్రభుత్వం 40 శాతం, కాంట్రాక్టర్‌ 60 శాతం నిధులతో చేపట్టాల్సిన పనులు టెండర్‌ దశలోనే ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రఫీక్‌ ఉన్నిసా, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ చారి, ఆర్‌ఐ శ్రీలతపై గ్రామాల సర్పంచులు, ఎఫ్పీఓ చైర్మన్‌ వెంకట్రాంరెడ్డి, డీసీఎంఎస్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ రమేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సునీతారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement