చేగుంట(తూప్రాన్): వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని మక్కరాజీపేట గ్రామంలో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మక్కరాజీపేట గ్రామంలో దాదాపు 70శాతం రైతుల వరి పంటలు వడగండ్ల వానకు దెబ్బతిన్ననాయని అన్నారు. వరి కోతదశలో ఉండటంతో ధాన్యం రాలిపోయిందని వాపోయారు. అధికారులు పర్యటించి రైతుల వివరాలను సేకరించి పరిహారం అందించాలని కోరారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శివప్రసాద్ గ్రామానికి చేరుకొని రైతులందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వానికి నివేదించనున్నట్లు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.


