అదనపు ఎస్పీగా బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

అదనపు ఎస్పీగా బాధ్యతల స్వీకరణ

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

మెదక్‌జోన్‌: మెదక్‌ అదనపు ఎస్పీగా విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ అదనపు ఎస్పీగా పనిచేసిన మహేందర్‌ ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన విషయం విధితమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికి రాగా, జిల్లా పోలీస్‌ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలపై ఆరా తీశారు. ప్రజల భద్రత, చట్టసంరక్షణలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్‌, నరేందర్‌గౌడ్‌, సుభాష్‌ చంద్రబోస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement