చిన్నశంకరంపేట(మెదక్)/చేగుంట(తూప్రాన్): వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని మక్కరాజీపేట, రాంపూర్, కరీంనగర్, గొల్లపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటలను ఆయన పరిశీలించి మాట్లాడారు. దాదాపు 1,700 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసి ఉంటే రైతులకు బీమా డబ్బులు వచ్చేవని తెలిపారు. గతేడాది రైతులు నష్టపోతే కొందరికీ ఇప్పటివరకు ప్రభుత్వం పరిహారం అందించలేదని ఆరోపించారు. ఆయన వెంట బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు భూపాల్, కార్యకర్తలు, అధికారులు ఉన్నారు. అనంతరం నార్సింగి మండల కేంద్రంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు కంటితుడుపు పరిహారం కాకుండా కనీసం పెట్టుబడి అయినా అందేలా ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట తహసీల్దార్ గ్రేసిబాయి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, నార్సింగి మండల నాయకులు చంద్రశేఖర్, లింగారెడ్డి, సత్యపాల్‌రెడ్డి, నర్సింహులు ఉన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు


