4 సీట్లు.. 12 నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

4 సీట్లు.. 12 నామినేషన్లు

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

మెదక్‌ కలెక్టరేట్‌: మెదక్‌ బల్దియాకు సంబంధించి కో ఆప్షన్‌ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ సోమవారం ముగిసింది. చివరిరోజు బీఆర్‌ఎస్‌ నుంచి 4, కాంగ్రెస్‌ నుంచి 1 నామినేషన్‌ దాఖలు చేశారు. బల్దియాలో 4 సీట్లు ఖాళీ ఉండగా, మొత్తం 12 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాంగ్రెస్‌ నుంచి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, నాయకులు తరలివచ్చి నామినేషన్‌ పత్రాలను కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. మొదటి రోజు కాంగ్రెస్‌ నుంచి మూడు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ కౌన్సిలర్లంతా ఐక్యంగా ఉండి కో ఆప్షన్‌ పదవులు సాధించాలని చైర్‌పర్సన్‌ సూచించారు. అలాగే మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు, నాయకులు తరలివచ్చి 4 నామినేషన్లు కమిషనర్‌కు అందజేశారు. ఒక్కో సీటుకు 4 చొప్పున నామినేషన్లు వచ్చాయి.

కో ఆప్షన్‌ పదవులకు నామినేషన్లు

ముగిసిన స్వీకరణ గడువు

Advertisement
 
Advertisement
Advertisement