విద్యార్థులకు నాణ్యమైన భోజనం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నాణ్యమైన భోజనం

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

మెదక్‌కలెక్టరేట్‌: పాఠశాలల్లో పారిశుద్ధ్యం, నాణ్యమై న భోజనంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులను ఆదేశించారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం సంక్షేమ వారోత్సవాలను కలెక్టర్‌ ప్రారంభించారు. ఇందులో భాగంగా మెదక్‌ పట్టణంలోని మైనార్టీ బాలికల పాఠశాల, హాస్టల్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. వంటకు ఉపయోగిస్తున్న పదార్థాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. మరుగుదొడ్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్‌ వెంట మెదక్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌లో బీసీ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బసవేశ్వరుని జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. బసవేశ్వరుడు సాంప్రదాయక సమాజంలో కుల, మత భేదాలకు వ్యతిరేకంగా పోరాడిన అభ్యుదయ వాదని కొనియాడారు. సాయంత్రం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో మ్యాపింగ్‌ చేసుకునేలా రాజకీయ పార్టీల బూత్‌స్థాయి ఏజెంట్ల సమన్వయంతో స్పష్టమైన జాబితా రూపకల్పన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement