బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త | - | Sakshi
Sakshi News home page

బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త

Apr 21 2026 6:01 AM | Updated on Apr 21 2026 6:01 AM

జోగిపేట(అందోల్‌): విశ్వగురు, మహాత్మ బసవేశ్వర 893వ జయంతి సందర్భంగా జోగిపేట చౌరస్తాలో సోమవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త, దార్శనికుడు, కవి, రాజనీతిజ్ఞుడుగా అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. వారి బోధనలు, ఆశయాలు ఆచరణీయమని పేర్కొన్నారు. ‘పనే ప్రత్యక్ష దైవం‘అని బోధించారన్నారు. ప్రతి వ్యక్తి తన కష్టార్జితంతో జీవించాలని, శ్రమకు గౌరవం ఇవ్వాలని చాటి చెప్పారన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ అర్‌డీ మాధురి, మున్సిపల్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఎ.చిట్టిబాబు, కౌన్సిలర్లు, వీరశైవ లింగాయత్‌ సమాజం అధ్యక్షుడు రవి, నాయకులు పట్లోళ్ల రవి, రమేశప్ప, రాజేందర్‌, జోగినాథ ఆలయ పూజారి భద్రప్ప, ఇతర ప్రజాప్రతినిధులు, లింగాయత్‌ సమాజం, సామాజికవేత్తలు పాల్గొన్నారు.

మంత్రి దామోదర రాజనర్సింహ

Advertisement
 
Advertisement
Advertisement