నర్సాపూర్‌రూరల్: సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ విజయ విద్యార్థినులకు సూచించారు. మండలంలోని చిప్పల్‌తుర్తి కేజీబీవీలో సోమవారం యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో వివిధ అంశాలపై సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేయగా, ప్రారంభించి మాట్లాడారు. క్యాంపులో స్కిల్స్ డెవలప్‌మెంట్, ఉన్నత విద్య కోసం ఎంట్రెన్స్‌కు సన్నద్ధంతో పాటు వివిధ అంశాలపై 10 రోజుల పాటు క్యాంపు కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని ఆయా కేజీబీవీల విద్యార్థులు క్యాంపులో పాల్గొంటారని వివరించారు. ఆమె వెంట కేజీబీవీ ప్రత్యేక అధికారి శ్వేత, అధ్యాపకులు ఉన్నారు.
డీఈఓ విజయ


