మెదక్‌జోన్: ఉమ్మడి మెదక్ జిల్లా చదరంగం పోటీలను ఆదివారం పట్టణంలోని అవుట్‌డోర్ స్టేడియంలో నిర్వహించినట్లు డీవైఎస్‌ఓ రమేశ్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు త్వరలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. అండర్ 7– 11 బాలబాలికలు పాల్గొనగా, అండర్ –11 బాలికల విభాగంలో మొదటి బహుమతి సంగారెడ్డికి చెందిన జస్వంతిక, ద్వితీయ బహుమతి వేద కై వసం చేసుకున్నారు. అండర్ –11 బాలుర విభాగంలో మొదటి బహుమతి సంగారెడ్డికి చెందిన రిత్విక్, ద్వితీయ బహుమతి మెదక్ చెందిన ఇప్ప సాయి, తృతీయ బహుమతి సంగారెడ్డికి చెందిన విగ్నేశ్ పొందారు. అండర్–7 బాలుర విభాగంలో సంగారెడ్డికి చెందిన శ్రీవిశ్వ, ద్వితీ య బహుమతి రితీశ్‌ను వరించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ ఇప్ప రాజేందర్, అసోసియేషన్ సభ్యులు శివకుమార్, సౌజన్య, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్ర సారస్వత పరిష త్ బాలల కథల పోటీల్లో ‘అందరూ చేసిందే చే ద్దాం’ కథ ఉత్తమంగా ఎంపికై నట్లు బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం ఆదివారం తెలిపారు. మొత్తం 180 కథలలో పది కథలు ఎంపిక కాగా, అందులో సిద్దిపేటకు చెందిన అనిశెట్టి సతీశ్‌కుమార్ రాసిన కథ ఉత్తమ బహుమతికి ఎంపికై ందన్నారు. ఈ మేరకు కవులు బస్వరాజ్ కుమార్, కోణం పరశురాములు, వర్కోలు లక్ష్మయ్య, బి. సుధాకర్, చిరంజీవి, తిరుపతి, కాల్వ రాజయ్య తదితరులు అభినందనలు తెలిపారన్నారు.
బసవేశ్వరుడు అందరివాడు
జహీరాబాద్ టౌన్: సమాజంలో అనేక మూఢాచారాలను పారద్రోలి కులమత రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేసిన బసవేశ్వరుడు అందరివాడని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు అభిప్రాయపడ్డారు. బసవేశ్వరుడి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రీయ బసవదళ్ ఆధ్వర్యంలో పట్టణంలో బసవ మండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ...బసవేశ్వరుడు జగత్ గురువని, లింగాయత్ సమాజాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన మహానుభావుడన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు, కులాలు, మతాల ప్రజలు కలిసిమెలసి ఉంటూ గౌరవించుకోవాలని చెప్పారని ఉద్బోధించారు. నేటి తరానికి బసవేశ్వరుడి చరిత్ర తెలిసి ఉండాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ ఎం.శివకుమార్, రాష్ట్రీయ బసవదళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌పాటిల్, మాజీ చైర్మన్ నరోత్తం, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తట్టునారాయణ, లింగాయత్ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్ షెట్కార్, ఆర్.సుభాష్ పాల్గొన్నారు.
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
నారాయణఖేడ్: ప్రభుత్వం అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో ఇందిరమ్మ ఇంటిని ఆదివారం ఆయన ప్రారంభించి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.


