దాతల సహకారం వెలకట్టలేనిది | - | Sakshi
Sakshi News home page

దాతల సహకారం వెలకట్టలేనిది

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

నర్సాపూర్‌ రూరల్‌: గ్రామాల అభివృద్ధి కోసం దాతలు అందిస్తున్న సహాయం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. అదివారం మండలపరిధి రుస్తుంపేటలో ఆర్‌సీటీ సొల్యూషన్‌ సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు కేసీఆర్‌ మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందించిన విషయం గుర్తుచేశారు. వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థ నిర్వాహకులు శిల్పారెడ్డి సుకుమార్‌రెడ్డి దంపతులను అభినందించారు. అనంతరం సర్పంచ్‌ వర్ష, ఉపసర్పంచ్‌ వీరేశం సహకారంతో 100 మంది వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, మాజీ ఆత్మకమిటీ చైర్మన్‌ శివకుమార్‌ తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యే సునీతారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement