నారాయణఖేడ్: ఖేడ్ మండలంలోని ర్యాకల్ గ్రామంలోని ఎల్లమ్మ జాతర ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం కుస్తీపోటీలు నిర్వహి ంచారు. ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. ప్రాంతం నుంచే కాకుండా కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం మల్లయోధులు తరలివచ్చారు. 500మంది వరకు మల్లయోధులు స్థాయిని బట్టి పోటీలు నిర్వహించి చివరి కుస్తీ విజేతకు రూ.5,100లు బహుమతిగా అందజేశారు.
అటవీశాస్త్రంలో పీహెచ్‌డీ
ములుగు(గజ్వేల్): ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో చదువుకుంటున్న విద్యార్థి బోచు జీవన్ అటవీ శాస్త్రంలో పీహెచ్‌డీ సాధించారు. ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యంలో ఫైటోసోసియాలజీ, కార్బన్ నిల్వలు మరియు ప్రధాన మట్టి పోషకాలపై అధ్యయనం పూర్తి చేశారు.


