రైల్వేగేటు దాటని కష్టాలు | - | Sakshi
Sakshi News home page

రైల్వేగేటు దాటని కష్టాలు

Apr 19 2026 1:44 PM | Updated on Apr 19 2026 1:44 PM

ఆర్వోబీ నిర్మాణానికి రూ.47 కోట్లు మంజూరు టెండర్‌ ప్రక్రియ పూర్తయినా ప్రారంభం కాని పనులు ప్రయాణికులకు తప్పని తిప్పలు

చేగుంట: రైల్వేగేటు పడటంతో నిలిచిన వాహనాలు

ఆ రెండు శాఖలకు రూ. 2 కోట్లు!

రైల్వేగేట్‌ వద్ద ఆర్వోబీ నిర్మించేందుకు విద్యుత్‌ స్తంభాలు ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు తొలగించాల్సి ఉంది. అలాగే భూమిలో నుంచి వేసిన మిషన్‌ భగీరథ పైపులైన్లును సైతం తొలగించి మరో చోటు నుంచి వేయాల్సి ఉంటుంది. ఈ రెండు శాఖలకు సంబంధించి సుమారు రూ. 2 కోట్ల వరకు రైల్వేశాఖ చెల్లించాల్సి ఉందని తెలిసింది. ఇప్పటివరకు డబ్బులు చెల్లించకపోవడంతోనే పనులు ప్రారంభించలేదని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు సైతం పెరిగి వృక్షాలుగా మారాయి. వాటిని అటవీశాఖ అధికారులు తొలగించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఆర్వోబీ పనులు ప్రారంభం అయితే ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారి మళ్లింపు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం తాత్కాలిక బోర్డులు సైతం ఏర్పాటు చేయాలి.

దశాబ్ద కాలంగా మెదక్‌ నుంచి చేగుంటకు వెళ్లే ప్రయాణికులకు రైల్వేగేటు కష్టాలు తప్పడం లేదు. రైలు వచ్చిన ప్రతీసారి 10 నిమిషాల పాటు గేటు వేయడం పరిపాటిగా మారింది. ఈమార్గంలో నిత్యం 25 నుంచి 30 రైళ్లు తిరగుతుంటాయి. ఇక క్రాసింగ్‌ ఉందంటే అరగంటకు పైగా వేచి చూడాల్సిందే. కాగా ఈ ప్రాంతంలో ఆర్వోబీ నిర్మాణానికి నిధులు మంజూరై ఏడాది అవుతోంది. అయినా పనులు నేటికీ ప్రారంభం కాకపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పటం లేదు.

– మెదక్‌జోన్‌

జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల మండలాలు, గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది హై దరాబాద్‌ వెళ్తుంటారు. జాతీయ రహదారి 44 కలపటంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కాగా చేగుంట రైల్వేగేట్‌ వద్ద రోజూ 5 నుంచి 8 గంటలు గేటు మూయాల్సిన పరిస్థితి. ఫలితంగా ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. చాలాసార్లు అంబులెన్స్‌లు నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. రైల్వేగేటు వద్ద ఆర్వోబీ నిర్మాణానికి రూ. 42 కోట్లు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన టెండర్‌ పూర్తయి ఏడాది కావొస్తోంది. పనులు త్వరగా పూర్తి చేయా లని ఎంపీ రఘునందన్‌రావు వివిధశాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement