మెదక్ కలెక్టరేట్: రేపటి నుంచి 26వ తేదీ వరకు జిల్లాలో ఏడురోజుల పాటు సంక్షేమ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు అదనపు కలెక్టర్ నగేశ్, ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్య పనులు, మరమ్మతులు చేపడుతామని తెలిపారు. అలాగే విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అంతకుముందు వివిధశాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. భూగర్భ లైన్లు దెబ్బతినకుండా కాపాడటమే సీబీయూడీ యాప్ లక్ష్యమని తెలిపారు. తవ్వకాలు జరిపేటప్పుడు చట్టపరమైన నిబంధనలను పాటించడం, ప్రజల భద్రతను (ప్రభుత్వ ఆస్తులతో సహా) కాపాడడం మన కర్తవ్యమని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీపీఓ యాదయ్య, డీఎఫ్‌ఓ జోజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


