రోడ్డు భద్రతపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రతపై అవగాహన

Apr 18 2026 8:23 AM | Updated on Apr 18 2026 8:23 AM

చిన్నశంకరంపేట(మెదక్‌): ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని మెదక్‌ అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ సూచించారు. శుక్రవారం స్థానిక మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. ప్రమాదాల నివారణకు హెచ్చరిక రేడియం స్టిక్కర్లను వినియోగించాలని కోరారు. అనంతరం ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తామని ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ నారాయణగౌడ్‌, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సాయిసింధు పాల్గొన్నారు.

ఎంవీఐ శ్రీనివాస్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement