మెదక్ కలెక్టరేట్: ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మెదక్ జిల్లా ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ దొంత నరేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదు ట బైఠాయించి నిరసన తెలిపారు. భోజన విరామ సమయంలో భాగస్వామ్య సంఘాలతో కలసి నిర్వహించిన కార్యక్రమంలో నరేందర్ మాట్లాడా రు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన మూడు విడతల కరువు భత్యాలు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న ఐదు విడతల కరువు భత్యం విడుదల చేయక పోవడం అన్యాయం అని పేర్కొన్నారు. అలాగే ఐదు శాతం మధ్యంతర భృతితో పీఆర్సీ కమిషన్ వేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు పే రివిజన్ కమిషన్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే కమిటీ నివేదిక తెప్పించుకొని వెంటనే 51 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగుల ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న 13వేల కోట్ల బకాయిలు యుద్ధ ప్రాతిపాదికన విడుదల చేయాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్‌ను కలసి సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి విట్టల్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలి
51 శాతం ఫిట్‌మెంట్
వెంటనే ప్రకటించాలి
జిల్లా జేఏసీ చైర్మన్
దొంత నరేందర్ డిమాండ్
కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల నిరసన


