మొగులు.. గుబులు | - | Sakshi
Sakshi News home page

మొగులు.. గుబులు

Mar 17 2026 8:23 AM | Updated on Mar 17 2026 8:23 AM

భ యపెడుతున్న అకాల వర్షాలు

వాతావరణ మార్పులతో రైతుల్లో కలవరం

పాలు పోసుకునే దశలో వరిచేలు

దుబ్బాక: రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారింది. 20 రోజుల క్రితం గాలివాన, వడగళ్ల బీభత్సంతో జిల్లాలో పెద్దఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. ఈదెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే మళ్లీ వాతావరణంలో మార్పులు అన్నదాతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈనెల 20 వరకు గాలివానతో కూడిన భారీ వర్షాలు, వడగళ్లు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సోమవారం వడగళ్ల వాన కురిసింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 60 శాతానికి పైగా వరి పంటలు పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఇప్పుడు గాలివాన, వడగళ్లు పడితే తీవ్ర నష్టం వాటిళ్లే అవకాశం ఉంది. జిల్లాలో మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ జలశయాల్లో సంవృద్ధిగా నీరు ఉండడంతో పెద్ద ఎత్తున రైతులు వరి సాగు చేశారు. రైతులు రూ. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు వేసుకోగా, తీరా చేతికొచ్చే దశలో ప్రకృతి ఆగం జేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement