మెదక్ కలెక్టరేట్: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం పట్టణంలోని 1, 16, 17 వార్డుల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్ గౌడ్ పర్యటించారు. ఈసందర్భంగా ప్రజలతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయించారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్): ఉపాధ్యాయులు అ ంకితభావంతో పనిచేసి విద్యార్థుల అ భ్యున్నతికి కృషి చేయాలని డీఈఓ విజయ అన్నారు. సోమవారం మండలంలోని తునికి వద్ద గల ఎంజేపీ గురుకుల పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, పరిసరాలు, పారిశుద్ధ్యం, కిచెన్‌రూంను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యల గురించి ప్రిన్సిపాల్ హరిబాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విధులు పట్ల అంకిభావంతో పనిచేయాలన్నారు.


