కనీస వేతనాలు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

కనీస వేతనాలు అమలు చేయాలి

Mar 17 2026 8:23 AM | Updated on Mar 17 2026 8:23 AM

మెదక్‌ కలెక్టరేట్‌: కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్షా ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పద్మారావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పుకనుగుణంగా సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు. అలాగే సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా కోశాధికారి అజయ్‌ కుమార్‌, కార్యదర్శులు నాగుల్‌ మీరా, శేఖర్‌, భీమ్లా నాయక్‌, నర్సింలు, తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, సీఆర్పీల జిల్లా అధ్యక్షుడు గట్టయ్య, కేజీబీవీల యూనియన్‌ రాష్ట్ర నాయకులు సుహాసిని, పూర్ణేశ్వర్‌ ఉమా, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement