తునికి ఎంజేపీ విద్యార్థికి 91.2 పర్సంటైల్‌ | - | Sakshi
Sakshi News home page

తునికి ఎంజేపీ విద్యార్థికి 91.2 పర్సంటైల్‌

Feb 18 2026 8:08 AM | Updated on Feb 18 2026 8:08 AM

తునిక

తునికి ఎంజేపీ విద్యార్థికి 91.2 పర్సంటైల్‌

శ్రీరాముని ఆశీస్సులు అందరిపై ఉండాలి

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండలంలోని తునికి వద్దగల ఎంజేపీ (మహాత్మ జ్యోతిబాపూలే) బీసీ గురుకుల కళాశాల విద్యార్థి జేఈఈ మెయిన్స్‌లో 91.2 పర్సంటైల్‌ సాధించి సత్తాచాటాడు. కొల్చారం మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన కన్నెబోయిన విజయ్‌కుమార్‌ ప్రస్తుతం తునికి ఎంజేపీలో కొనసాగుతున్న కౌడిపల్లి ఎంజేపీ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా, గత నెలలో విజయ్‌కుమార్‌ జేఈఈ మెయిన్స్‌ పరీక్ష రాయగా 91.2పర్సంటైల్‌ సాధించాడు. విజయ్‌కుమార్‌ తల్లిదండ్రులు శేఖులు, లక్ష్మి సాధారణ వ్యవసాయ కుటుంబం. ప్రభుత్వ పాఠశాలలో చదివి జేఈఈలో మంచి ఫలితం సాధించడంతో కళాశాల ప్రిన్సిపాల్‌ హరిబాబు, లెక్చరర్లు అతన్ని శాలువాతో సన్మానించారు. భవిష్యత్తులో చదువులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. విజయ్‌కుమార్‌కు జాతీయస్థాయిలో మంచి ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుకునే అవకాశం లభిస్తుందని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

తొలగించిన చెప్పుల కుప్పలు

రాజగోపురం ఎదుట నుంచి

స్టాల్‌లోకి మార్చిన సిబ్బంది

పాపన్నపేట(మెదక్‌): ‘దుర్గమ్మా ఇదేం దుర్గతి’శీర్షికన మంగళవారం ‘సాక్షి’ప్రచురించిన కథనానికి ఆలయ, పంచాయతీ అధికారులు స్పందించారు. ఆగమేఘాల మీద రాజగోపురం ఎదురుగా ఉన్న చెప్పుల కుప్పలను సిబ్బంది తొలగించారు. చెప్పుల స్టాండ్‌ కోసం నిర్మించిన హాల్‌ను వినియోగంలోకి తెచ్చారు. భక్తుల పాదరక్షలు చెప్పుల స్టాండ్‌లో భద్రపరిచారు. ఒక్కో జతకు రూ.40 చొప్పున వసూలు చేశారు. దీంతో రాజగోపురం ముందు.. దుర్గమ్మ ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రధాన వీధి శుభ్రంగా మారింది. అలాగే శివాలయం ముందు పక్కన గల ఎంగిలి విస్తారాకుల పెంటను కూడా తొలగించి, దేవాలయ ప్రాంగణాన్ని పవిత్రతకు ప్రతీకగా తీర్చిదిద్దారు.

మామిడికి కవర్లు

రక్షణ కవచం

ఉద్యానశాఖ జిల్లా అధికారి సోమేశ్వర్‌రావు

జహీరాబాద్‌ టౌన్‌: కాయలకు కవర్లు కట్టడం వల్ల మామిడికి రక్షణ కవచంలా ఉంటుందని ఉద్యానశాఖ జిల్లా అధికారి సోమేశ్వర్‌రావు పేర్కొన్నారు. కోహీర్‌ మండలంలోని బిలాల్‌పూర్‌, కోహీర్‌ మామిడి రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇటీవల కాలంలో మామిడికి తెగుళ్ల బెడద తీవ్రంగా వేధిస్తోందన్నారు. నల్లతామర, పండుఈగ, తేనె మంచు, మసి తెగులు, బంక తెగుళ్ల నుంచి కాయలను కాపాడుకునేందుకు రక్షణ కవర్లను కడుతున్నారని చెప్పారు. నిమ్మకాయ సైజులు వచ్చినప్పుడు కాయలకు కవర్లు కట్టాలన్నారు. తెగుళ్ల బాధకూడా తగ్గుతుందన్నారు. మామిడిలో తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఆయన రైతులకు వివరించారు.

గజ్వేల్‌రూరల్‌: శ్రీరాముని ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని గజ్వేల్‌ ఏసీపీ నరసింహులు అన్నారు. గోటి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు భద్రాచలం నుంచి వచ్చిన వడ్లకు మంగళవారం గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లోగల పార్దివేశ్వరస్వామి దేవాలయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆకుల నరేష్‌బాబుతో కలిసి ఆయన మాట్లాడుతూ భద్రాచలంలోని సీతారాముల కళ్యాణోత్సవంలో వినియోగించే గోటి తలంబ్రాలను సిద్ధం చేసే కార్యక్రమంలో తమను భాగస్వాములను చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

తునికి ఎంజేపీ విద్యార్థికి  91.2 పర్సంటైల్‌1
1/2

తునికి ఎంజేపీ విద్యార్థికి 91.2 పర్సంటైల్‌

తునికి ఎంజేపీ విద్యార్థికి  91.2 పర్సంటైల్‌2
2/2

తునికి ఎంజేపీ విద్యార్థికి 91.2 పర్సంటైల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement