క్షేత్రస్థాయిలో గ్రూప్‌–1 శిక్షణ అధికారులు | - | Sakshi
Sakshi News home page

క్షేత్రస్థాయిలో గ్రూప్‌–1 శిక్షణ అధికారులు

Feb 18 2026 8:08 AM | Updated on Feb 18 2026 8:08 AM

క్షేత

క్షేత్రస్థాయిలో గ్రూప్‌–1 శిక్షణ అధికారులు

క్షేత్రస్థాయిలో గ్రూప్‌–1 శిక్షణ అధికారులు

రామాయంపేట(మెదక్‌): గ్రూప్‌–1 శిక్షణ అధికారులు మంగళవారం మండలంలోని ఆర్‌ వెంకటాపూర్‌ను సందర్శించారు. ముందుగా పంచాయతీ కార్యాలయంలో మహిళా గ్రూపు సభ్యులతో మాట్లాడారు. సంఘాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని నర్సరీ, డంపింగ్‌ యార్డును పరిశీలించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. అధికారుల్లో డీఎస్పీలు సందీప్‌ నాయక్‌, ప్రతిభ, సీటీవోలు దివ్య, సంగీత, ఏఈలు శ్రీరాం హర్ష, లక్ష్మణ్‌ ఆనంద్‌ ఉన్నారు. వారి వెంట ఎంపీడీవో సజీలుద్దీన్‌, ఎంపీవో రాజేందర్‌, ఏపీవో శంకర్‌, గ్రామ కార్యదర్శి శ్యామల ఉన్నారు.

గ్రూప్‌ వన్‌ అధికారుల పర్యటన

శివ్వంపేట(నర్సాపూర్‌): మండల పరిధి సికింద్లాపూర్‌ గ్రామంలో శిక్షణలో ఉన్న ఆరుగురు

గ్రూప్‌1 అధికారులు మంగళవారం పర్యటించారు. వీరి పర్యటనలో గ్రామాల్లోని ప్రజల స్థితిగతులు, సమస్యలు, అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, ఎంపీఓ తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ అరుణ, మాజీ సర్పంచ్‌ సత్యనారాయణ, ఏపీఓ అనిల్‌, కార్యదర్శులు రాజు, రాఘవేంద్రభట్టాచార్యులు, తదితరులున్నారు.

మల్లంపేటలో..

పాపన్నపేట(మెదక్‌): పాపన్నపేట మండలం మల్లంపేటలో మంగళవారం శిక్షణ గ్రూపు–1 అధికారులు పర్యటించారు. గ్రామస్థాయిలో పంచాయతీ పరిపాలన, మహిళా సంఘాల పొదుపు, ఉపాధిహామీ తదితర సంక్షేమ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు విజయ్‌కుమార్‌, ప్రియాంజలి, ఆంజనేయులు, శంతన్‌ కుమార్‌ రెడ్డి, ఫహిమీనఫైజ్‌, సాయికమల్‌ పాల్గొన్నారు.

గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఆరా

క్షేత్రస్థాయిలో గ్రూప్‌–1 శిక్షణ అధికారులు1
1/1

క్షేత్రస్థాయిలో గ్రూప్‌–1 శిక్షణ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement