అప్రమత్తంగా ఉండాలి
నర్సాపూర్: ప్రాణాంతక వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి హేమలత అన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మా ట్లాడారు. మంచి ఆహారం, శారీరక వ్యాయామం, యోగాసనాలు అలవర్చుకొని ఆరోగ్య వ ంతంగా ఉండాలని హితవుపలికారు. మెరుగైన వైద్యం సకాలంలో అందించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యు లు నిరుపమ, రాము, పలువురు న్యాయవాదులు స్వరూపరాణి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ: శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈనెల 31 వరకు జిల్లావ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమయంలో పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. శాంతి భద్ర తల నిర్వహణకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మెదక్‌జోన్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం అకాడమిక్ ఆడిట్ నిర్వహించారు. గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నికత్ అంజుమ్, జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ లచ్చయ్యల నేతృత్వం కొనసాగింది. రికార్డులను తనిఖీ చేసి, కళాశాలకు సంబంధించిన అడ్మిషన్‌న్లు, ఫలితాలు, విద్యార్థుల బోధన తీరుతెన్నులు, గ్రంథాలయం, క్రీడా విభాగం, టాయిలెట్స్ స్టూడెంట్స్ స్టడీ ప్రాజెక్టు, సాంకేతిక బోధనలు సైన్స్ లేబోరేటరీ, కంప్యూటర్ ల్యాబ్స్, క్లాస్‌రూమ్స్, పారిశుద్ధ్యం మొదలైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమగ్ర నివేదికను విద్యాశాఖకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హుస్సేన్, వైస్ ప్రిన్సి పాల్ సింహారెడ్డి, అకాడమిక్ కో–ఆర్డినేటర్ శరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌ను సోమవారం డీఈఓ విజయ సందర్శించారు. ప్రార్థన ముగిసిన వెంటనే విద్యార్థులకు నీతి కథలు చెప్పగా, ఆస క్తిగా విన్నారు. అనంతరం ఉపాధ్యాయుల వి వరాలు, రిజిస్టర్‌ను పరిశీలించారు. కార్యక్ర మంలో ఉపాధ్యాయులు కరుణాకర్, రాజేశం, రాజశేఖర్, అశోక్ ఉన్నారు.
ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం: సీఐటీయూ
జహీరాబాద్ టౌన్: ఐక్యతతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. మండలంలోని బూచినెల్లి పారిశ్రామిక వాడలో గల సీఐఈ పరిశ్రమలో సోమవారం వేతన ఒప్పదం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం సీఐటీయూతోనే సాధ్యమన్నారు. కార్మికుల పక్షాన ఉంటూ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. 4 లేబర్ కోడ్ల రద్దు కోసం ఐక్య ఉద్యమాలు చేయాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం, నాయకులు మహిపాల్, రాజిరెడ్డి, సందీప్‌రెడ్డి, నర్సయ్య, నరేష్, నారాయణ, రవి పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
అప్రమత్తంగా ఉండాలి
అప్రమత్తంగా ఉండాలి


