‘జాగ్రత్తలు తప్పనిసరి’ | - | Sakshi
Sakshi News home page

‘జాగ్రత్తలు తప్పనిసరి’

Oct 19 2025 8:28 AM | Updated on Oct 19 2025 8:28 AM

‘జాగ్

‘జాగ్రత్తలు తప్పనిసరి’

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. అగ్ని ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాణాసంచా విక్రయించే వారు అనుమతులు తీసుకోవాలన్నారు. వినియోగదారులకు సరళమైన ధరలకే అమ్మాలన్నారు. పటాకులు కాల్చేటప్పుడు పిల్లలు, పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పాల్గొనాలన్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన నాణ్యమైన పటాకులనే వినియోగించాలన్నారు. పర్యావరణహిత పటాకులను ఉపయోగించడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పారు. అగ్ని ప్రమాదాలు, గాయాలు సంభవించినప్పుడు వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించడంతో పాటు వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 101 లేదా 8712699263కు తెలియజేయాలనివివరించారు.

మహిళలు

అన్ని రంగాల్లో రాణించాలి

నర్సాపూర్‌: మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని ఇన్‌చార్జి డీడబ్ల్యూఓ హేమభార్గవి అన్నారు. మండల లీగల్‌ సర్వీస్‌ కమిటీ ఆధ్వర్యంలో శనివారం మున్సిపాలిటీలోని హన్మంతాపూర్‌లో అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వయం సహాయక సంఘాల మహిళలతో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగు పర్చుకోవడానికి పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. చదువుకొని విజ్ఞాన వంతులు కావాలన్నారు. సమావేశంలో లీగల్‌ సర్వీస్‌ కమిటీ సభ్యురాలు స్వరూపరాణి, జిల్లా ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ కోఆర్డినేటర్‌ సంతోష, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సఖీ, భరోసా కేంద్రాలతో రక్షణ

మెదక్‌జోన్‌: ప్రభుత్వం ఏర్పాటు చేసిన సఖీ, భరోసా కేంద్రాలు ఎంతోమంది బాధిత మహిళలకు రక్షణ వేదికలని సీనియర్‌ సివిల్‌ జడ్జి రుబీనా ఫాతిమా అన్నారు. శనివారం ఆమె పట్టణంలోని సఖీ, భరోసా కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. ఈ వేదికల ద్వారా ఎంతో మంది బాధిత మహిళలకు వైద్య సహాయం, కౌన్సెలింగ్‌, న్యాయ సహాయం, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలు అందుతాయని తెలిపారు. బాలసదన్‌లో చిన్నారులతో మాట్లాడి, వారి సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట సిబ్బంది సుచిత, శ్వేత, అడ్వకేట్‌ బాల నరసింహులు తదితరులు ఉన్నారు.

నూతన నియామకం

మెదక్‌జోన్‌: Æ>çÙ‰ {糿¶æ$™èlÓ ÇOsñæÆŠḥz E§øÅ-VýS$ÌS çÜ…çœ$… hÌêÏ A«§ýlÅ-„ýS$-yìlV> Ô>Å…çÜ$…-§ýl-ÆŠ‡¯]l$ HMýS-{X-Ð]l…V> G¯]l$²-MýS$-¯é²Æý‡$. Ôèæ°-ÐéÆý‡… ç³rt׿ …ÌZ° ÇOsñæÆŠ‡z E§øÅ-VýS$ÌS ¿ýæÐ]l-¯]l…ÌZ HÆ>µr$ ^ólíܯ]l D çÜÐ]l*Ðól-Ô>°MìS çÜ…çœ$… Æ>çÙ‰ A«§ýlÅ-„ýS$yýl$ _ÍÐólÇ ^èl…{§ýl-Ôóæ-QÆŠ‡ Ð]l¬QÅ A†¤V> àf-Æý‡Ä¶æ*ÅÆý‡$. DçÜ…-§ýlÆý‡Â…V> BĶæ$¯]l Ð]l* sêÏ-yýl$-™èl*.. ÇOsñæÆŠ‡z E§øÅ-VýS$ÌS çÜÐ]l$-çÜÅÌS ç³Ç-ÚëPÆý‡… MøçÜ… °Æý‡…-™èl-Æý‡…V> MýS–íÙ ^ólÝë¢-Ð]l$-¯é²Æý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ Ð]l*i A«§ýlÅ-„ýS$yýl$ fVýS©‹Ù^èl…{§ýl, {糫§é¯]l M>Æý‡Å-§ýlÇØ çÜ™èlÅ-¯é-Æ>-Ķæ$׿, MøÔ>-«¨M>Ç VøÍ MýS$Ð]l*ÆŠæ, AÝùíÜÄôæ$sŒæ {ò³íÜyðl…sŒæ Æ>Ð]l¬Ë$, E´ë-«§ýlÅ„ýS$Ë$ ´ù^èlĶæ$Å, Ððl*çßæ-¯ŒSÆ>gŒæ, çÜ$ÖÌS ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.

బీజేపీది రెండు నాల్కల వైఖరి: సీపీఎం

మెదక్‌ కలెక్టరేట్‌: కేంద్రంలోని బీజేపీ తీరు రెండు నాల్కల వైఖరిగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ మండిపడ్డారు. శనివారం జిల్లాలో నిర్వహించిన బంద్‌కు మద్దతుగా మెదక్‌లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేశారు.

‘జాగ్రత్తలు తప్పనిసరి’ 
1
1/2

‘జాగ్రత్తలు తప్పనిసరి’

‘జాగ్రత్తలు తప్పనిసరి’ 
2
2/2

‘జాగ్రత్తలు తప్పనిసరి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement