
మీడియా పాత్ర కీలకం
ప్రజాస్వామ్య దేశంలో వార్తా పత్రి కల పాత్ర కీలకం. అలాంటి మీడియాపై దాడులు చేయ టం సరికాదు. వాస్తవాలను ప్రచురితం చేసే ‘సాక్షి’ దినపత్రికపై ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న చర్యలు గర్హనీయం. వార్తలు రాసిన విలేకరులు, ఎడిటర్‌ను నోటీసుల పేరుతో వేధింపులకు గురి చేయటం మంచిది కాదు.
– జనార్దన్‌రెడ్డి, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్,
సీనియర్ న్యాయవాది
రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే
కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన సాక్షిపై దాడులు చేయటం సరికాదు. ఏపీలోని కూటమి ప్రభుత్వానిది హేయమైన చర్య. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజాలు నిర్భయంగా రాసే పత్రిక గొంతు నొక్కితే అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే. మీడియా జోలికి వస్తే సహించేది లేదు.
– నోముల శ్రీకాంత్,
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు

మీడియా పాత్ర కీలకం