
సమస్యల పరిష్కారానికి కృషి
చేగుంట(తూప్రాన్): మండల కేంద్రంలోని బాలికల ఎస్టీ గురుకుల పాఠశాలను శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. గణితం బోధించే లెక్చరర్ లేకపోవడంతో ఇటీవల ఇంటర్ విద్యార్థినులు ధర్నా చేసిన విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అనంతరం గురుకులంలోని వంటగది, తరగతి గదులను పరిశీలించారు. గురుకులం నిర్వహణ గురించి ప్రిన్సిపాల్ సుమతిని అడిగి తెలుసుకున్నారు. దారిలో వీధి దీపాలు లేకపోవడంతో గురుకుల సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, అలాగే మెరుగైన రోడ్డు లేదని ప్రిన్సిపాల్ ఆయన వివరించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎఎస్‌డబ్ల్యూఓ లింగేశ్వర్, తహసీల్దార్ శివప్రసాద్, ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి, హాస్టల్ వార్డెన్ రమేశ్, సిబ్బంది ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య