
సద్దుల సంబురం
చిన్నశ ంకరంపేట: అంబాజీపేటలో బతుకమ్మలను నిమజ్జనానికి తీసుకెళ్తూ..
శివ్వంపేట: బతుకమ్మ పేరుస్తున్న ఎమ్మెల్యే సునీతారెడ్డి
● జిల్లాలో ఘనంగా పెద్ద బతుకమ్మ
● సంబురంగా ఆడిపాడిన మహిళలు
● ఊరూరా గౌరమ్మకు ఘన వీడ్కోలు
సద్దుల సంబురాలు జిల్లాలో అంబరాన్నంటాయి. సోమవారం ఆడబిడ్డల ఆటపాటలతో ఊరూరూ పూలవనాల్లా మారాయి. ఉదయం నుంచే మహిళలు తీరొక్కపూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం కొత్త దుస్తులు ధరించి, గౌరమ్మకు పూజలు చేశారు. అనంతరం కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ఆటాపాటలతో హోరెత్తించారు. అనంతరం స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. ‘పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా’ అంటూ వీడ్కోలు పలికారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కాగా కొన్ని మండలాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలను మంగళవారం నిర్వహించనున్నారు.

సద్దుల సంబురం