
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
కౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. సోమవారం మండలంలోని తునికి గేట్ సమీపంలోని ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్‌హాల్ ఏర్పాటు కోసం గదులు, పరిసరాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికల రిజర్వేషన్లు పూర్తికాగా, ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. దీంతో జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తునికి ఎంజేపీలో బ్యాలెట్ బాక్స్‌లు భద్రపరిచేందుకు, కౌటింగ్ కోసం పరిశీలించినట్లు వివరించారు. గురుకులానికి సంబంధించి పూర్తివివరాలు ప్రిన్సిపాల్ హరిబాబును అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో పటిష్టంగా కోడ్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శనివారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముది హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్, అదనపు ఎస్పీ మహేందర్, ఇతర శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కోడ్ ఉల్లంఘన జరిగితే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఆర్డీఓ రమాదేవి, నోడల్ అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్