
సమస్యలుంటే నేరుగా సంప్రదించాలి
మెదక్ మున్సిపాలిటీ: ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా సంబంధిత పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి చట్టప్రకారం ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారుల సహకారంతో వాటిని పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు.
అదనపు ఎస్పీ మహేందర్