ఆర్టీసీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యంకోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి హమీ ఇచ్చారు. బుధవారం ఎస్‌డబ్ల్యూయూ, టీడబ్ల్యూయూ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీమంత్రి వేణుగోపాలచారితో కలిసి మంత్రి మాట్లాడుతూ గతంలో నిలిచిపోయిన డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ కార్మికులకు అండగా ఉంటామన్నారు. సొంతింటి కల నేరవేరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి టీడబ్ల్యూయూను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రీజినల్ కార్యదర్శి భీమేశ్వర్‌రావు, డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశం, డిపో కార్యదర్శి నాగరాజు, అధ్యక్షుడు సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.


