శ్రీరాంపూర్: గనుల్లో పనిముట్ల కొరత తీర్చాలని సీఐటీయూ శ్రీరాంపూర్ బ్రాంచి కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆర్కే న్యూటెక్ గనిపై గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కనీసం కార్మికుల రక్షణ కవచాలైన బూట్లు, గ్లౌజులు, సాక్సులు ఇవ్వడం లేదన్నారు. దీంతో కార్మికులు ఇబ్బంది పడటమే కాకుండా దీని ప్రభావం ఉత్పత్తిపై కూడా పడుతుందన్నారు. సంస్థ గత ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాలను ప్రకటించి కార్మికులకు వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించారు. పిట్ సెక్రెటరీ పెరిక సదానందం, తదితరులు పాల్గొన్నారు.


