మందమర్రిరూరల్: ిసంగరేణి సంస్థ లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ కూడా ఉందని, సంస్థకు వచ్చిన లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు 10 శాతం వాటా చెల్లించే విధంగా చూడాలని కోరుతూ బుధవారం సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూ నియన్ (ఐఎఫ్‌టీయూ)నాయకులు మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బ్ర హ్మానందం మాట్లాడుతూ పర్మినెంటు కార్మికులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, వాటాల పంపిణీలో కనీసం 10 శాతం వాటా ఇప్పించే విధంగా యాజమాన్యాన్ని ఒప్పించాలని కోరారు. శ్రీనివాస్, రాయలింగు, భూమ య్య, కనుకయ్య, గణేశ్, అజయ్ పాల్గొన్నారు.


