కాసిపేట గనిని సందర్శించిన సేఫ్టీ జీఎం | - | Sakshi
Sakshi News home page

కాసిపేట గనిని సందర్శించిన సేఫ్టీ జీఎం

Oct 7 2026 11:43 PM | Updated on Oct 7 2026 11:43 PM

కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట గనిని బుధవారం బెల్లంపల్లి రీజియన్‌ జనరల్‌ మేనేజర్‌ రవికుమార్‌ సందర్శించారు. గనిలో మూడో సీమ్‌ 13 డిస్ట్రిక్ట్‌ను సందర్శించి పనులను పరిశీలించారు. గనిలో తీసుకుంటున్న రక్షణ చర్యలను పర్యవేక్షించి అధికారులకు, ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని ఉత్పత్తి, ఉత్పాదకతకు ఇచ్చిన ప్రాముఖ్యత రక్షణకు సైతం ఇవ్వాలని సూచించారు. ఆయన వెంట మందమర్రి ఏరియా రక్షణాధికారి వేముల మురళి, మేనేజర్‌ సతీష్‌, రక్షణాధికారి సురేష్‌, అధికారులు, సూపర్‌వైజర్లు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement