లాభాల వాటా 40 శాతం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

లాభాల వాటా 40 శాతం చెల్లించాలి

Oct 7 2026 11:43 PM | Updated on Oct 7 2026 11:43 PM

● ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య

శ్రీరాంపూర్‌: సింగరేణి కార్మికులకు గడిచిన ఆర్థిక సంవత్సరం కంపెనీ సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించి అందులో నుంచి 40 శాతం వాటాను చెల్లించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం శ్రీరాంపూర్‌ ఏరియా వర్క్‌షాప్‌లో గేట్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల ప్రధాన డిమాండ్లపై జూన్‌ 8న సమ్మె నోటీసు ఇచ్చామని, దీనిపై ఆర్‌ఎల్‌సీ సమక్షంలో చర్చలు జరిగాయని, ఇందులో పలు డిమాండ్లపై ఒప్పందం జరిగిందన్నారు. కార్మికుడు సహజ మరణం పొందితే రూ.20 లక్షల పరిహారం, పెర్క్స్‌పై ఆదాయపన్ను కంపెనీ చెల్లిస్తుందని, హైదరాబాద్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏ ర్పాటు, మెడికల్‌ అటెండెన్స్‌ నిబంధనలో మార్పులు ఇంకా ఇతర హక్కులు సాధించామన్నారు. స మావేశంలో ఆ యూనియన్‌ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు కే.వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్‌ కార్యదర్శి షేక్‌ బాజీసైదా, జీఎం కమిటీ చర్చల ప్రతినిధులు బద్రి బుచ్చయ్య, సురేష్‌, జిల్లా కార్యదర్శి అఫ్రోజ్‌ఖాన్‌, పిట్‌ కార్యదర్శులు గనిగంటి నర్సింగరావు, సదానందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement