శ్రీరాంపూర్: అభివృద్ధికోసం సింగరేణి లాభాల్లోంచి ఏటా కేటాయిస్తున్న నిధుల లెక్క చెప్పాలని సీఐటీయూ కేంద్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆర్కే న్యూటెక్ గనిపై పిట్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ భవిష్యత్ అవసరాలకు, అభివృద్ధి కోసం కొన్నేళ్లుగా కోట్లాది రూపాలయ నిధులను పక్కనపెట్టారని, అవి ఏం చేశారో ఇప్పటి వరకు లెక్క చెప్పడం లేదని ఆరోపించారు. ఇటీవల మెడికల్ బోర్డులో అర్హులైన కార్మికులను అన్‌ఫిట్ చేయకుండా ఫిట్ చేయడం అన్యాయమన్నారు.
పిట్ కమిటీ
పిట్ సెక్రెటరీగా పెరుక సదానందం, పిట్ ఇన్‌చార్జిగా మర్చకుర్తి రమేశ్, మైనింగ్ స్టాప్ ఇన్‌చార్జిగా జే.వెంకటేష్, పిట్ అసిస్టెంట్ సెక్రెటరీగా అరిగే సందీప్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా తిరుపతి, షిఫ్ట్ ఇన్‌చార్జీలుగా బాలకృష్ణ, నవీన్ అభిలాష్‌తో పాటు సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రెటరీ కస్తూరి చంద్రశేఖర్, నాయకులు వెంగళ శ్రీనివాస్, మేడిపల్లి శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, సంఘం రాజయ్య పాల్గొన్నారు.


