మంచిర్యాలటౌన్: రాష్ట్రవ్యాప్తంగా గడ్డి మందును బ్యాన్ చేయడంలో కీలకపాత్ర పోషించిన మంచిర్యాలకు చెందిన డాక్టర్ రాకేశ్ చెన్నను ఆదివారం హైదరాబాద్‌లోని ఐఎంఏ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించి అవార్డు అందజేశారు. ఎన్‌ఎంసీ చైర్మన్‌లు నాగేశ్వర్ రెడ్డి, గంగాధర్, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ చేతుల మీదుగా రాకేశ్ అవార్డు అందుకున్నారు. డాక్టర్ అగైనెస్ట్ పారాక్వాట్ పాయిజనింగ్ (డీఏపీపీ)ని మూడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయగా తెలంగాణలో ఆర్నెల్ల క్రితం, ఆంధ్రప్రదేశ్‌లో రెండు నెలల క్రితం గడ్డిమందును బ్యాన్ చేయడంలో రాకేశ్ విశేష కృషి చేశారు.


